ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేస్తున్నా.. వాటిని నిల్వ చేసుకొనేందుకు గోదాములు లేకపోవడంతో మార్కెట్ యార్డుల్లోనే పేరుకుపోతున్నాయి

ఆదిలాబాద్ ః ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేస్తున్నా.. వాటిని నిల్వ చేసుకొనేందుకు గోదాములు లేకపోవడంతో మార్కెట్ యార్డుల్లోనే పేరుకుపోతున్నాయి. జొన్న కొనుగోళ్లు ముగియగా.. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో 50 వేల క్వింటాళ్లకు పైగా జొన్న సంచులు నిల్వ ఉన్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేసిన సోయా, కంది, శనగ, మక్క, జొన్న పంటలను సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ, ఇతర గోదాముల్లో భద్రపరుస్తుంది. వానకాలం, యాసంగిలో కొనుగోలు చేసిన పంటలతో గోదాములు నిండిపోయాయి.
