అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణ గురుకుల వ్యవస్థకు గడ్డురోజులు దాపురిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేశంలోనే ఇక్కడి గురుకుల వ్యవస్థకు పతాకస్థాయిలో పేరొచ్చిం ది. అయితే.. గత రెండేళ్లుగా గురుకుల విద్యాలయాల్లో అనేక ఘటనలు చోటు చేసుకోవడమే గందరగోళానికి కారణంగా చెబుతున్నారు.

అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణ గురుకుల వ్యవస్థకు గడ్డురోజులు దాపురిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేశంలోనే ఇక్కడి గురుకుల వ్యవస్థకు పతాకస్థాయిలో పేరొచ్చిం ది. అయితే.. గత రెండేళ్లుగా గురుకుల విద్యాలయాల్లో అనేక ఘటనలు చోటు చేసుకోవడమే గందరగోళానికి కారణంగా చెబుతున్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, పర్యవేక్షణ లోపంతో బయటకు వెళ్లిన విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకోవడం, ఫుడ్పాయిజన్ ఘటనలు, చివరకు ఎలుకలు కరిచి దవాఖానల పాలవ్వడం వరకు చూ స్తే.. వరుస ఘటనలు గురుకులాల్లో విద్యాభ్యాసం చేస్తున్న పిల్లల తల్లితండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని గురుకులాల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు భరోసా లేకుండా పోతుంది.
