ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడగా, మరికొన్ని చోట్ల ఇండ్లపైకప్పులు ఎగిరిపడ్డాయి.

కోటగిరి (పొతంగల్)/గాంధారి/బిచ్కుంద/ సిరికొండ, జూన్ 7: ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడగా, మరికొన్ని చోట్ల ఇండ్లపైకప్పులు ఎగిరిపడ్డాయి. పొతంగల్ మండలం తిర్మలాపూర్, కోటగిరి మండలంలోని ఎత్తొండ క్యాంప్‌లో పలువురి ఇండ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. మరికొందరి ఇండ్లపై చెట్లు పడగా ఇంట్లో ఉన్న సామాన్లు ధ్వంసమయ్యాయి. కొందరు తమ ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరిందని వాపోయారు. ఎత్తొండ క్యాంప్‌లో ఓ తాటిచెట్టుపై పిడుగు పడింది.
