మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ సందర్భంగా జరిగిన వివాదంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి స్పందించారు.

కౌడిపల్లి, ఏప్రిల్ 17: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ సందర్భంగా జరిగిన వివాదంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి స్పందించారు. కౌడిపల్లి సర్పంచ్‌కు కుర్చీ వద్దని అనలేదని తెలిపారు. మిగతా సర్పంచ్‌లు కింద నిల్చున్నారు కాబట్టి.. వారికీ కుర్చీలు వేయించాలని ఎంపీడీవోను కోరినట్లు వెల్లడించారు.
బుధవారం రైతు వేదికలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారని తెలిపారు. అలాగే కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్, ఆయా మండలాల సర్పంచ్‌లు హాజరయ్యారని చెప్పారు
