ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కోమట్లగూడెం గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ ఎ.జయసుధ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

రైతుల ఆర్థిక పురోభివృద్ధి పశువుల ఆరోగ్యంపైనా ఆధారపడి ఉంటుందన్నారు. కావునా పాడి పశువులకు సరైన సమయంలో వైద్యం అందించాలని సూచించారు. అనంతరం కారేపల్లి పశువైద్యాధికారి ఇందిర పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. గర్భకోశ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు. వైద్య శిబిరాలను పశువుల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
