ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కస్టమర్లుగా నటిస్తూ గోల్డ్ షాప్ కు వెళ్లిన మహిళలు చేతివాటం ప్రదర్శించారు.

ప్రయాగ్‌రాజ్ లోని కల్యాణ్ జువెలర్స్ షోరూమ్ లో ఈ ఘటన జరిగింది. ఆభరణాలు కొనేందుకు కస్టమర్లుగా వెళ్లిన ముగ్గురు మహిళలు అక్కడ సిబ్బంది కళ్లుగప్పి చోరీకి పాల్పడ్డారు. సేల్స్‌మెన్ వారికి బంగారు ఆభరణాలను చూపించడంలో బిజీగా ఉన్న సమయంలో గాజు షోకేస్‌లో ఉన్న చెవిపోగుల డిస్ప్లే ప్యాడ్‌ను దొంగలించారు. ఎవరికీ కనిపించకుండా దుస్తుల్లో దాచుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. కేవలం 14 నిమిషాల్లోనే పనిముగించుకుని ఉడాయించారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యా
