తెలంగాణ సమాజానికి అబద్ధపు హామీలు, ఆచరణ సాధ్యంకాని గ్యారంటీలు ఇచ్చి అధికార పీఠాన్ని దకించుకున్న కాంగ్రెస్ పార్టీ.. రెండేండ్ల పాలనలోనే అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజ మెత్తారు

సిటీబ్యూరో, మే 31: తెలంగాణ సమాజానికి అబద్ధపు హామీలు, ఆచరణ సాధ్యంకాని గ్యారంటీలు ఇచ్చి అధికార పీఠాన్ని దకించుకున్న కాంగ్రెస్ పార్టీ.. రెండేండ్ల పాలనలోనే అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజ మెత్తారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇన్చార్జి మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో క్లాసిక్ గార్డెన్స్‌లో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కేటీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
