
దిల్సుఖ్నగర్, అక్టోబర్ 16 (శ్రీరామ్ చక్రి న్యూస్ పేపర్): దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శుక్రవారం దిల్సుఖ్నగర్లోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాంచందర్, కార్యనిర్వహణాధికారి (ఈఓ) స్నేహలత ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు తోట మహేష్ యాదవ్, మధుసాగర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
