హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ శివారు ఎస్సారెస్పీ కాల్వను కొందరు రియల్టర్లు ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టారు.

హసన్పర్తి, మే 28 : హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ శివారు ఎస్సారెస్పీ కాల్వను కొందరు రియల్టర్లు ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టారు. ఈ కాల్వ ద్వారా వచ్చే నీటితో చుట్టు పక్కల రైతు లు పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాల్వను కొద్దిమేర వెడల్పు చేసి బాక్స్ డ్రెయిన్ తరహాలో నిర్మించేందుకు ఇనుప రాడ్లను ఏర్పా టు చేశారు. అయితే ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసే జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా చేయడం వల్ల తమకు కాల్వ ద్వారా నీళ్లు వస్తా యో? రావో? అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ఈ మేరకు ఓ రైతు సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా, వచ్చి చూస్తామని చెప్పి ఇంతవరకు ఇటువైపు రాలేదని ఆవేదన చెందారు.
