హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం సురారం గ్రామంలో గత మూడు రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

హన్మకొండ, జూన్ 11: జిల్లాలోని ఎల్కతుర్తి మండలం సురారం గ్రామంలో మూడు రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాత్రి కాగానే ఎలుగు గ్రామ వీధుల్లోకి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయంగా ఉందని వాపోతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి ఎలుగు వచ్చి దాడి చేస్తుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నామని చెబుతున్నారు.
