ఉమ్మడి జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. భానుడు అగ్ని గుండంలా మారి నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం నుంచే భానుడు భగభగ మంటున్నాడు

కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తున్నది. వడదెబ్బ బారిన పడి ఇప్పటికే పలువురు మృత్యువాత పడగా, తాజాగా భీమ్గల్ మండలంలో ఓ ఉపాధి హామీ మహిళా కూలీ వడదెబ్బతో మృతి చెందింది. మండుతున్న ఎండలకు ముఖ్యంగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు బయటికి వెళ్లాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొందరు ఎండ దెబ్బ, వడ దెబ్బ తెలియక ఆందోళన చెందుతున్నారు. ఎండదెబ్బ తగిలిన కూడా వడదెబ్బ అనుకొని కంగారు పడి సమస్యను మరింత తీవ్రతరం చేసుకొని దవాఖానలకు వెళ్తున్నారు.
