ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని గొప్పలు చెప్పుకొంటున్నన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాగా, అధికారులకు, అధికార పార్టీ నాయకులకు నిరుపేద దళిత మహిళ కనిపించడం లేదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు

గజ్వేల్, మే 30: ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని గొప్పలు చెప్పుకొంటున్నన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాగా, అధికారులకు, అధికార పార్టీ నాయకులకు నిరుపేద దళిత మహిళ కనిపించడం లేదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అన్ని అర్హతలున్నా.. ఇల్లు మంజూరు కాకపోవడంలో తలదాచుకునే చోటు లేక కమ్యూనిటీ భవనంలో కొడుకుతో జీవనం సాగిస్తున్నది. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా దళిత మహిళకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నారు.
