తొర్రూరు మండలం హరిపిరాల శివారులోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి 2021లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రూ.200 కోట్లతో శంకుస్థాపన చేశారు.

తొర్రూరు, జూన్ 9 : తొర్రూరు మండలం హరిపిరాల శివారులోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి 2021లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రూ.200 కోట్లతో శంకుస్థాపన చేశారు. దీంతోపాటు చుట్టు పకల మండలాలు, గ్రామాల రైతులకు అందుబాటులో ఉండేలా ఆయిల్‌పామ్ నర్సరీని కూడా ప్రారంభించారు. అయితే, ఆయిల్‌పామ్ నర్స రీ పెంపకంలో అధికారులు, కాంట్రాక్టర్ల నిర క్ష్యం కారణంగా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆరోపించారు. నాసిరకం విత్తనాలు, మట్టి, ఎరువులు వినియోగించడం వల్ల మొకలు సరిగా ఎదగక ఎండిపోతున్నాయని, సకాలంలో మొకలు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశా రు.
