ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కు పూర్తిగా స్వస్తి పలకాలని నిర్ణయించింది.

దేశంలోని ఇతర ఐటీ కంపెనీలు వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీస్‌కు వస్తే చాలని చెబుతున్నారు. కానీ టీసీఎస్ మాత్రం ఐదు రోజులు కచ్చితంగా రావాలని నిబంధన పెట్టింది. అంతేకాకుండా వేరియబుల్ పే ను కూడా అటెండెన్స్‌తో లింక్ చేసింది. కంపెనీ నిర్ణయంతో సంస్థలోని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. పెరిగే జీతం కంటే ఆఫీసుకు వెళ్లేందుకు అయ్యే ఖర్చే ఎక్కువ అని వాపోతున్నారు. పెరుగుతున్న అద్దెలు, రవాణా, భోజన ఇతర ఖర్చులను సాకుగా చూపుతూ చాలా మంది వర్క్‌ఫ్రమ్ హోమ్‌కే మొగ్గు చూపుతున్నారు.
