ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ కెరీర్లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన చిత్రాలలో ‘హ్యాపీ’ ఒకటి. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ కెరీర్లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన చిత్రాలలో ‘హ్యాపీ’ ఒకటి. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రం నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు.
2006 జనవరి 27న విడుదలైన ఈ సినిమా రెండు దశాబ్దాల కాలాన్ని పూర్తి చేసుకున్న వేళ, తన జర్నీలో ఇది అత్యంత ఆనందాన్ని ఇచ్చిన చిత్రమని బన్నీ గుర్తుచేసుకున్నాడు. అద్భుతమైన విజన్‌తో ఈ కథను తెరకెక్కించిన దర్శకుడు ఎ. కరుణాకరన్‌కు, తన సహ నటి జెనీలియాకు, విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌కు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
