ఓ హాట్ ఎయిర్ బెలూన్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. బెలూన్‌లో గాలి అకస్మాత్తుగా తగ్గిపోవడంతో దాంట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ బెలూన్ను హైదరాబాద్‌లోని నెక్నమ్‌పూర్ లేక్‌లో ఎమర్జెన్సీగా దించేశారు. ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.

హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ ఈవెంట్లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. సంక్రాంతి సందర్భంగా సెలబ్రేట్ ద స్కై పేరుతో హాట్ ఎయిర్ బెలూన్ల ఈవెంట్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహిస్తున్నది. శుక్రవారం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఇవాళ ఓ హాట్ ఎయిర్ బెలూన్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. బెలూన్‌లో గాలి అకస్మాత్తుగా తగ్గిపోవడంతో దాంట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ బెలూన్ను నెక్నమ్‌పూర్ లేక్‌లో ఎమర్జెన్సీగా దించేశారు. ల్యాండింగ్ సమయంలో ఆ బెలూన్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ప్రస్తుతం ఆ బెలూన్ను నిర్వాహకులు తరలించారు.
