దేశంలో కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. మరి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం

కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు కాస్త నెమ్మదించాయి. సామాన్యులకు స్వల్ప ఊరటనిచ్చేలా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, డిసెంబర్ 2 తేదీ మధ్యాహ్నం 1.00 గంటకు హైదరాబాద్, కోల్కతా, ముంబై నగరాల్లో 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,30,200గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,30,350గా, 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,19,500గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్, 22 క్యారెట్ గోల్డ్ ధరలు వరుసగా రూ.1,31,135, రూ.1,20,400గా ఉన్నాయి
