సిరిగిరిపురం, అక్టోబర్ 16 (శ్రీరామ్ చక్రీ న్యూస్):

మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు, మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి మంగళవారం మహేశ్వరం మండల పరిధిలోని సిరిగిరిపురం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

పాఠశాలలోని వసతులు, మౌలిక సదుపాయాలపై విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె ఈ సందర్భంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహేశ్వరం మండల యువజన అధ్యక్షుడు డి. శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, పిఎసిఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్, నాయకులు వినోద్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
