
జనవరి:18 (శ్రీరామ్ చక్రి న్యూస్)’మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని సరూర్‌నగర్ ఎన్టీఆర్ నగర్ డివిజన్లో గల బాప్టిస్ట్ చర్చ్‌లో క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన లవ్ ఫెస్ట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, సోదర ప్రేమను, ఐక్యతను పెంపొందించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా ఆమె క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ, లవ్ ఫెస్ట్ అనేది అందరూ కలిసి భోజనం చేస్తూ ఫెలోషిప్ పంచుకునే ఒక మతపరమైన సామాజిక సమావేశమని తెలిపారు. క్రైస్తవ మతంలో సంఘ సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యతను పెంపొందించడమే ఈ భోజన కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే తాను చిన్నతనంలో మిషనరీ స్కూల్లో చదివిన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, ఆర్కే పురం డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నాగేష్, సీనియర్ నాయకులు సాజిద్ భాయ్, గొడుగు శ్రీను, రామ నర్సింహా గౌడ్, వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
