యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ధనుర్మాస వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు.

యాదగిరిగుట్ట: భక్తుల కొంగు బంగారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ధనుర్మాస వేడుకలు జనవరి 14వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుని కొలుస్తూ నెల రోజులపాటు నిర్వహించే పాశుర పఠనాలను ఆలయ అర్చకులు, పారాయణీకులు ప్రత్యేకంగా జరిపిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 4.30 నుంచి 5 గంటల వరకు శ్రీస్వామి వారి ఆలయ ముఖ మండపంపై ఉత్తర భాగంలోని హాల్లో గోదాదేవి అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతోపాటు మార్గళి నివేదన వంటి వేడుకలు జరుగనున్నాయి.
