
డిసెంబర్ 18( శ్రీరామ్ చక్రి న్యూస్ )
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, టీకేఆర్ వాకర్స్ అసోసియేషన్ మరియు హైదరాబాద్ శాలివాహన లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అక్షర టెక్నో స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్‌ను మహేశ్వరం మాజీ శాసనసభ్యులు, హైదరాబాద్ మాజీ మేయర్ శ్రీ తీగల కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ నవీన్ మలిపెద్ది గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, ఈ మెగా హెల్త్ క్యాంప్ ద్వారా సుమారు 400 మందికి పైగా ప్రజలు వైద్య సేవలు పొందడం ఆనందకరమని తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన అనేక మంది వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని సేవలందించారని, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో టీకేఆర్ వాకర్స్ అసోసియేషన్‌కు చెందిన ఆర్. అర్జున్ రావు, మాజీ అధ్యక్షులు మోహన్ రావు, రమణారెడ్డి, హైదరాబాద్ శాలివాహన లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ జి. సత్యనారాయణ యాదవ్, కార్యదర్శి లయన్ ఆవుసుల శ్రీనివాసులు, అక్షర టెక్నో స్కూల్ అధిపతి గవర్నర్ లయన్ గోవింద్ రాజ్, వివిధ విభాగాల వైద్యులు, వాలంటీర్లు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
