| ఏనూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల పరిధిలో ఉన్న 191 గ్రామ పంచాయతీలు, 1,742 వార్డులకు మూడో విడత ఎన్నికల నిర్వహణకు గతంలో నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్లు స్వీకరించినట్లు తెలిపారు.

ఖమ్మం, డిసెంబర్ 15 : జిల్లాలో ఈ నెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. ఏనూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల పరిధిలో ఉన్న 191 గ్రామ పంచాయతీలు, 1,742 వార్డులకు మూడో విడత ఎన్నికల నిర్వహణకు గతంలో నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్లు స్వీకరించినట్లు తెలిపారు. మూడో విడతలో ఒక పంచాయతీ, 9 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని, 22 పంచాయతీలు,
