మునుగోడు మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

మునుగోడు జనవరి 18 : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000వ సంవత్సరంలో పదో తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆదివారం 25 ఏళ్ల అనంతరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. అందరూ ఒకే వేదికలో కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
