బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ముగిసి ఫలితాలు ఇలా వెలువడ్డాయో లేదో.. అలా ఫైవ్‌స్టార్ హోటల్ రాజకీయాలు మొదలయ్యాయి.

ఇతర పార్టీల వారు తమ కార్పొరేటర్లతో బేరసారాలు జరపకుండా, ప్రలోభాలకు గురి చేయకుండా వారందరినీ తన వద్ద ఉంచుకునేందుకు షిండే ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి మహాయుతి కూటమిగా పోటీ చేశాయి. అయితే కూటమిలో బీజేపీ తర్వాత 29 సీట్లతో శివసేన అతిపెద్ద పార్టీగా నిలిచింది. తమ పార్టీ సహకారం లేకుండా బీఎంసీ మేయర్ స్థానం దక్కించుకునే అవకాశం బీజేపీకి లేకపోవడంతో, బీజేపీ సహా ఇతర పార్టీల వారు ఎలాంటి అవకాశం తీసుకోకుండా ఆయన తన పార్టీ కార్పొరేటర్లందరినీ ఐక్యంగా ఉంచాలని ఫైవ్‌స్టార్ హోటల్‌కు వారిని తరలించారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పాగా వేసింది. ముంబైలో మూడు దశాబ్దాల శివసేన ఆధిపత్యానికి గండిపడింది. రాష్ట్రంలోని 29 కార్పొరేషన్లలో 25 చోట్ల బీజేపీ గెలుపొందింది.
