గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌తోపాటు వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.

ఆయా పార్టీల్లో నాయకుల పోకడలు, విధానాలు, సిద్ధాంతాలు నచ్చకపోవడంతో బీఆర్ఎస్ బాట పడుతున్నారు. గురువారం మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సమక్షంలో దమ్మక్కపేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మడి గౌతమితోపాటు ఎనిమిది మంది వార్డు అభ్యర్థులు కారం పద్మ, మడి సుధారాణి, కాక సంధ్య, బొగ్గు లక్ష్మి, కణితి అలివేలు, మడి లక్ష్మి, మడి నాగలక్ష్మి, గుండి సతీశ్, రావులపల్లి నాగేశ్వరరావులతోపాటు దమ్మక్కపేట గ్రామస్తులు మడి మల్లయ్య, మడి సీతమ్మ, బట్ట సాంబయ్య, కంటి అలివేలు, కలిపి జానకిరావు, కాక కీర్తి, మడి సందీప్‌కుమార్, అభిలాష్, రామారావు, పాముల అనూష, లక్ష్మణ్‌లు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
