జీహెచ్ఎంసీ పాలకమండలికి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రస్తుత కౌన్సిల్ పదవీకాలం మరో 15 రోజుల్లో ముగియనున్నది. వచ్చే నెల ఫిబ్రవరి 10తో మేయర్, డిప్యూటీ మేయర్‌తో కూడిన 150 మంది కార్పొరేటర్ల పదవీకాలం ముగుస్తున్నది. ఫిబ్రవరి 11 నుంచి గ్రేటర్ పాలనలో సరికొత్త అధ్యాయం మొదలుకానున్నది. ప్రజా ప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారి పాలన అమల్లోకి రాబోతున్నది.

జీహెచ్ఎంసీ పాలకమండలికి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రస్తుత కౌన్సిల్ పదవీకాలం మరో 15 రోజుల్లో ముగియనున్నది. వచ్చే నెల ఫిబ్రవరి 10తో మేయర్, డిప్యూటీ మేయర్‌తో కూడిన 150 మంది కార్పొరేటర్ల పదవీకాలం ముగుస్తున్నది. ఫిబ్రవరి 11 నుంచి గ్రేటర్ పాలనలో సరికొత్త అధ్యాయం మొదలుకానున్నది. ప్రజా ప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారి పాలన అమల్లోకి రాబోతున్నది. జీహెచ్ఎంసీలోకి 27 పురపాలికల విలీనంతో 150 నుంచి 300 వార్డులు, ఆరు జోన్లు కాస్తా 12 జోన్లు, 30 నుంచి 60 సర్కిళ్లుగా చేసిన అధికారులు, ఫిబ్రవరి 10 తర్వాత మహా జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి పాలన అందించేందుకు సర్కారు ఇప్పటికే అన్ని చర్యలు పూర్తి చేసింది.
