రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ కాటన్ మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

కాశీబుగ్గ, నవంబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ కాటన్ మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసినా ఫలితం రాలేదన్నారు. సీసీఐ అవలంబిస్తున్న అసమతుల్య అలాట్మెంట్, స్లాట్ బుకింగ్ విధానాలతో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా నిర్లక్ష్యం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీసీఐ సీఎండీ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లినా నేటికీ ఎలాంటి స్పందన లేదన్నారు.
