సముద్రం నడుమగల దీవిలో ఓ వ్యక్తికి గుండెపోటు రాగా.. సకాలంలో స్పందించిన భారత తీర రక్షక దళం అతడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడింది. లక్షద్వీప్ లోని అగాట్టీ ద్వీపంలో ఓ 55 ఏళ్ల వ్యక్తికి గుండెపోటు వచ్చింది.

వెంటనే స్పందించిన భారత తీర రక్షకదళం అతడిని హుటాహుటిన కొచ్చికి తరలించింది. బాధితుడిని అగాట్టీ ద్వీపం నుంచి తరలిస్తున్న సమయంలో విమానంలోని మొబైల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వైద్య బృందం ప్రథమ చికిత్స అందించింది. అనంతరం అతడిని కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు వెల్లడించారు.
