
కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వీరికి 8 నుంచి 10 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 73,670 మంది భక్తులు దర్శించుకోగా 26,062 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల రూ.4 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
