అక్రమ వ్యాపారంతో కోట్లు గడించిన అక్రమార్కులు, ఇప్పటికీ తమ దారి మార్చుకోవడం లేదు. ఇప్పుడు పల్లె నుంచి మిల్లు వరకు ఒక చైన్ సిస్టం ఏర్పాటు చేసుకొని, పకడ్బందీగా సన్నబియ్యం సేకరించి యథేచ్ఛగా దందాను నడుపుతున్నారు.

పల్లె నుంచి మిల్లు వరకు ఒక చైన్ సిస్టం ఏర్పాటు చేసుకొని, పకడ్బందీగా సన్నబియ్యం సేకరించి యథేచ్ఛగా దందాను నడుపుతున్నారు. పైగా సేకరించిన రేషన్ బియ్యాన్ని తిరిగి సర్కారుకే అప్పగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా సీఎంఆర్ ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లర్లు, ఈ వ్యవహారంలో ఎక్కువగా భాగస్వాములు అవుతున్నారు. ఈ తరహా బాగోతంపై పకడ్బందీగా నిఘా ఉంచాల్సిన, ఉమ్మడి జిల్లా యంత్రాగం నిద్ర మత్తులో తూగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
