ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఇవాళ(సోమవారం) ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కవిత పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు
