చారిత్రక కాకతీయ వైభవానికి ప్రతీకగా నిలిచే ఓరుగల్లు (Warangal) కోట, యాదవుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ జరిగిన ‘దున్న రాజుల సంబురాలు’తో (Sadar) దద్దరిల్లింది.

ఖిలావరంగల్: చారిత్రక కాకతీయ వైభవానికి ప్రతీకగా నిలిచే ఓరుగల్లు (Warangal) కోట, యాదవుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ జరిగిన ‘దున్న రాజుల సంబురాలు’తో (Sadar) దద్దరిల్లింది. దున్నపోతులకు ప్రత్యేక అలంకరణ చేసి కోట పురవీధుల్లో ఊరేగించడం, వాటి విన్యాసాలు ప్రదర్శించడం ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
