ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ దక్కింది. గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ దక్కింది. 2023లో గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కాగా, 2023లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్‌పై రిజర్వేషన్ల విధానాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్‌ను పాటించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు.
