హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక వెలువరించిన 24 కాపీల తీర్పు కాపీలను టీయూ పరిపాలన విభాగం స్వీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీలు చేరినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ రెండో వారంలోనే తీర్పు కాపీలు టీయూకు రావడంతో ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు వీసీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బయటికి తీర్పు కాపీలు తమకు చేరలేదని బుకాయిస్తున్నప్పటికీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక వెలువరించిన 24 కాపీల తీర్పు కాపీలను టీయూ పరిపాలన విభాగం స్వీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.
