ఓ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రావెల్స్ బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్ పైకి వచ్చేసరికి సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులకు సమాచారం అందించారు. దీంతో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది బయటకు వచ్చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు
