రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో ఓ సామాజికవర్గంలో ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని ఇద్దరు వ్యక్తులు ఒత్తిడి తెచ్చారనే సమాచారంతో, పోలీసులు అదుపులోకితీసుకొని కేసు నమోదుచేశారు. అనంతరం ఇద్దరిని తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేసి వదిలేశారు. అదేవిధంగా తంగళ్లపల్లి మండలంలోని మరో గ్రామంలో మరో సామాజిక వర్గం కులం కట్టు పెట్టడం కలకలం రేపింది. విషయం బయటకు పొక్కడం పోలీసులు రంగంలోకి దిగి, గ్రామంలో కుల సంఘాలకు అవగాహన కల్పించార
