సుమారు 500 మందికి వైద్య పరీక్షలు, ఉచిత మందులు పంపిణీ

వైద్య ఖర్చులు ఊహించనంతగా పెరిగిన నేపధ్యంలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం ప్రతి వ్యక్తి, సంస్థకు సామాజిక బాధ్యత అని నిర్వాహకులు తెలిపారు.
బద్రి లాల్–పన్న లాల్ పిట్టి ట్రస్ట్, సౌజన్యంతోలయన్స్ క్లబ్, కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్, మరియు శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత సమితి ఆధ్వర్యంలో ఇంద్రప్రస్థ కాలనీలోని డెల్హీ పబ్లిక్ స్కూల్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో సుమారు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. స్వచ్చంద సంస్థలు, క్రీయాశీలకులు కార్యక్రమంలో కృషి చేసి, ప్రజల ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం ప్రయత్నించాలని పేర్కొన్నారు.
నిర్వాహకులు అన్నారు, “ప్రజలకు అందిన వైద్య సహాయం, సేవా కార్యక్రమాలు సమాజానికి అనేక విధాలుగా ప్రయోజనకరమని, ఇలాంటి కార్యక్రమాలను తరచుగా నిర్వహించడం అవసరం” అని.
