భూపాల పల్లి జిల్లా అడవి నుంచి ములుగు మండలం జాకారం వద్ద సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా హనుమకొండ వైపు వెళ్తున్న 108 వాహన పైలట్ సాయిరెడ్డి దాన్ని చూసి వాహన వేగం తగ్గించాడు

సాయిరెడ్డి విషయాన్ని ఫారెస్టు అధికారులను తెలియజేయగా స్పందించిన ఎఫ్ఆర్వో డోలి శంకర్ సిబ్బందితో పెద్దపులి రోడ్డు దాటిన ప్రాంతాన్ని పరిశీలించి దాని అడుగులను గుర్తించారు. పెద్ద పులి నర్సరీలోకి వెళ్లి కంచె దాటే క్రమంలో పోల్ విరిగినట్లు గుర్తించారు. అప్రమత్తమైన ఫారెస్టు అధికారులు జాకారం, పందికుంట, మల్లంపల్లి, రామచంద్రాపురం, మదనపల్లి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎఫ్ఆర్వో వెంట బీట్ ఆఫీసర్లు, సిబ్బంది ఉన్నారు.
