హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఎస్సై భానుప్రకాశ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

అంబర్‌పేట ఎస్ఐ భానుప్రకాశ్‌కు సంబంధించిన 9 ఎంఎం సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. విజయవాడలో ఓ లాడ్జిలో తాను చదువుకునే పుస్తకాల దగ్గర పెట్టుకున్నప్పుడు అది మిస్ అయిందంటూ ఎస్ఐ చెప్పడంతో హైదరాబాద్ పోలీసులు విజయవాడలోని లాడ్జి, అందులో పనిచేసే బాయ్స్, హోటల్ యజమానిని ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించారు. తుపాకీకి సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు.. అసలు ఆ తుపాకీ వ్యవహారమేంటో తమకు తెలియదని లాడ్జి యాజమాన్యం చెప్పినట్లు సమాచారం. బెట్టింగ్ బాబు భాను ప్రకాశ్ తన జల్సాల కోసం తుపాకీని అమ్మేశాడంటూ ఆయన బ్యాచ్‌మేట్స్ చెప్పుకుంటున్నారు.
