
చైతన్యపురి, అక్టోబర్ 20 (శ్రీరామ్ చక్రీ న్యూస్): విజయదశమి పండుగను పురస్కరించుకుని చైతన్యపురి డివిజన్ పరిధిలోని మున్సిపల్ కార్మికులు, నరేష్, రమేష్, గణేష్ ,మహేష్‌లకు మాజీ కార్పొరేటర్ జిన్నారం విట్టల్ రెడ్డి ఆత్మీయంగా దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కార్మికులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి కష్టాలు ఎదురైనా అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. నిత్యం ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలు అభినందనీయమని కొనియాడారు.కార్మికుల కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్మికుల సంక్షేమానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని జిన్నారం విట్టల్ రెడ్డి పేర్కొన్నారు.
