
బడంగ్పేట్, అక్టోబర్ 16: (శ్రీరామ్ చక్రీ న్యూస్ పేపర్) మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో మీర్పేట్–ప్రశాంతి హిల్స్ ప్రధాన రహదారికి ఎట్టకేలకు మరమ్మతులు పూర్తయ్యాయి. గత కొంతకాలంగా గుంతలమయంగా మారిన ఈ రహదారిపై ప్రయాణించేందుకు వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డు దుస్థితితో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆగస్టు 1న జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు బడంగ్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం అందజేసినట్లు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తెలిపారు. రహదారి మరమ్మతులను వెంటనే చేపట్టకపోతే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు.వినతికి స్పందించిన అధికారులుప్రజల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు మరమ్మతులకు 45 రోజుల గడువు కోరినట్లు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు గడువులోపే మరమ్మతు పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన కృషి ఫలించిందని, రహదారి మరమ్మతులు పూర్తి కావడం ప్రజా పోరాటానికి దక్కిన విజయమని నాయకులు అభివర్ణించారు.ఈ సందర్భంగా సహకరించిన జీహెచ్ఎంసీ అధికారులకు, బడంగ్పేట్ సర్కిల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
