ప్రభుత్వ ఆస్పత్రిలో తన తల్లికి సరైన వైద్యం అందడం లేదని ఆరోపిస్తూ ఓ కుమారుడు చేసిన పని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

మంచిర్యాల: ప్రభుత్వ ఆస్పత్రిలో తన తల్లికి సరైన వైద్యం అందడం లేదని ఆరోపిస్తూ ఓ కుమారుడు చేసిన పని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి ఆస్పత్రి నుంచి తల్లిని వీల్చైర్లో కూర్చోబెట్టుకుని సుమారు 2 కిలోమీటర్లు తోసుకుంటూ ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది.
