(శ్రీరామ్ చక్రీ టీవీ )17/9/2026,మీర్పేట్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మీర్పేట్ కార్పొరేషన్లో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లెలగూడలోని స్వాగత్ గ్రాండ్ సమీపంలో గురువారం ఉదయం 8 గంటలకు కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మీర్పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు తులసి ముకేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శులు సిద్ధాల శ్రీనివాస్, కసిరెడ్డి వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు.ఈ సందర్భంగా ముకేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్లో విలీనమైందని పేర్కొన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో అనేక మంది పోరాటాలు చేశారని, వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.సెప్టెంబర్ 17ను కేవలం ఒక వేడుకగా కాకుండా తెలంగాణ పోరాట చరిత్రను గుర్తుచేసుకునే రోజుగా భావించాలని అన్నారు. పూర్వీకుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకుడు సుల ప్రభాకర్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు సోమేశ్వర, మాజీ కార్పొరేటర్లు మద్ది సబితా రాజశేఖర్రెడ్డి, గౌరీశంకర్, సీనియర్ నాయకులు ఆవుల సత్తయ్య, కాశీరాం యాదవ్, జగన్ ముదిరాజ్, మల్లేష్, మల్లికార్జున్, వంటేరు నరసింహారెడ్డి, ఉదయ్, ఆనంద్, మల్లారెడ్డి, ఆంజనేయులు, గీతారెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
