చారిత్రాత్మక గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో జరిగే ఆషాఢ మాసం బోనాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ,బాధ్యతతో పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు

మెహిదీపట్నం,జూలై 10ః చారిత్రాత్మక గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో జరిగే ఆషాఢ మాసం బోనాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ,బాధ్యతతో పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం గోల్కొండ కోటలో ప్రభుత్వ శాఖల అధికారులతో గోల్కొండ బోనాల ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సన్నాహక సమావేశం నిర్వహించారు.
