వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు.

కంఠేశ్వర్, జూలై 7: వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం ఆమె జక్రాన్పల్లి మండలం మునిపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్సియల్ జూనియర్, డిగ్రీ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని స్టోర్రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, తరగతి గదులను పరిశీలించారు.
