ఓ ప్రయాణికుడి వయసు 24 ఏళ్లు. కానీ టికెట్‌పై ఏడాది మాత్రమే అని ప్రింట్ అయ్యింది. అతను రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడు. రైల్వే శాఖ అతనికి 7 వేల ఫైన్ వేసింది. బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో ఈ ఘటన జరిగింది.

నాగపూర్: బెంగుళూరు నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు నాగ్‌పూర్ వరకు వెళ్లాడు. అయితే అతని టికెట్(Railway Ticket)పై వయసు కేవలం ఒక్క ఏడాది మాత్రమే ప్రింట్ అయి ఉన్నది. ఏడాది వయసున్న టికెట్‌తో ఆ ప్రయాణికుడు జర్నీ చేశాడు. జూన్ 23వ తేదీన 22691 నెంబర్ రైలులో ఈ ఘటన జరిగింది. టికెట్ చెకింగ్ సమయంలో రైల్వే టీసీ ఆ ప్రయాణికుడికి ఫైన్ వేశాడు. ఏడాది వయసు ఉన్నట్లుగా ఉన్న టికెట్‌తో 24 ఏళ్ల వ్యక్తి ప్రయాణించాడు. అతని పేరు రమాకాంత్. అయితే టీటీఈ వెరిఫికేషన్ సమయంలో ఈ-టికెట్‌పై 24కు బదులుగా 1 సంఖ్య ఉన్నది. డాటా ఎంట్రీలో పొరపాటు వల్ల టికెట్‌పై ఏడాది వయసు మాత్రమే ఉన్నట్లు తప్పుగా పడిందని ఆ ప్రయాణికుడు చెప్పాడు.
