
(శ్రీరామ్ చక్రీ న్యూస్) టుడే 28/6/2026 ,
మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ కమలా నగర్ కాలనీ పరిధిలోని యూపీహెచ్సీ (UPHC) కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ‘పల్స్ పోలియో–2026’ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మదారి సురేఖ రమేష్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో యూపీహెచ్సీ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని పోలియో నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
