
(శ్రీరామ్ చక్రి న్యూస్) 16-06-2026,టుడే న్యూస్ | మహేశ్వరం నియోజకవర్గం
టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డిని కలిసిన సాయిబాబా నగర్ కాలనీ నూతన అధ్యక్షుడు
మహేశ్వరం నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్ డివిజన్ పరిధిలోని సాయిబాబా నగర్ కాలనీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రఘు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన రఘుకు దేప భాస్కర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసి, కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి సేవలు అందించాలని సూచించారు.కాలనీ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం. స్థానిక ప్రజల సహకారంతో కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని రఘు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, ముప్పిడి లింగస్వామి గౌడ్, శేఖర్ ముదిరాజ్, అలేటి కిరణ్, పెద్దవూర సైదులు, శ్రవణ్ కురుమ తదితరులు పాల్గొన్నారు
