
(శ్రీరామ్ చక్రి న్యూస్) 16-06-2026
టుడే న్యూస్ | మహేశ్వరం నియోజకవర్గం
రూ.2.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన,ప్రజల సమస్యల పరిష్కారమే మా బాధ్యత.. అభివృద్ధే మా సంకల్పం : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిమహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి సర్కిల్, జీహెచ్ఎంసీ 63వ డివిజన్ పరిధిలోని షాహీనగర్, కొత్తపేట్, నబీల్ కాలనీ, కొత్తపేట్ వాటర్ ట్యాంక్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వర్షపు నీరు, డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం రూ.2 కోట్ల 25 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, కొత్తపేట్ నబీల్ కాలనీలో వర్షపు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో దశలవారీగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే పలు పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ ప్రాంతంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.జల్పల్లి సర్కిల్లో ఇప్పటికే వాటర్ లైన్లు, డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు, రోడ్ల అభివృద్ధి పనులకు భారీగా నిధులు వెచ్చించామని తెలిపారు. నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తున్నామని వెల్లడించారు.షాహీనగర్, కొత్తపేట్, నబీల్ కాలనీ, కొత్తపేట్ వాటర్ ట్యాంక్ ప్రాంతాల్లో సీసీ రోడ్ల పనులను తక్షణమే ప్రారంభించి, సానిటేషన్, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.”ప్రజల సమస్యల పరిష్కారమే మా బాధ్యత.. అభివృద్ధే మా సంకల్పం” అనే లక్ష్యంతో పనిచేస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో జల్పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకట్ రామ్, డీఈ, ఏఈ, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు, స్థానిక మాజీ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
