
(శ్రీరామ్ చక్రి న్యూస్) 15/6/2026,హైదరాబాద్, కొత్తపేట: వాసవి క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సోమవతి అమావాస్య సందర్భంగా ఆర్కే పురంలోని శ్రీ వారాహి ప్రత్యంగిరా దేవాలయంలో అన్నప్రసాదం, వస్త్రదాన కార్యక్రమం నిర్వహించారు. దాతల సహకారంతో సుమారు 600 మందికి అన్నప్రసాదం పంపిణీ చేయడంతో పాటు వస్త్రదానం చేశారు.
కార్యక్రమానికి వాసవి క్లబ్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు కొల్పూరు రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్లబ్ అధ్యక్షుడు అల్లడి హరీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కూన వెంకటేష్ రాజ్, కోశాధికారి కొండూరు సృజన్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.కన్వీనర్ నాంపల్లి శ్రీనివాస్, కో-కన్వీనర్ పొద్దుటూరు వేణుగోపాల్, బురుగు లింగయ్యతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ప్రతి అమావాస్య రోజున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు సభ్యులు పేర్కొన్నారు.
